మంగళవారం, 19 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (16:36 IST)

బంగారుపల్లి తండాలో "కంటైనర్ స్కూల్".. ఆ స్కూల్ వారికే!

school
తాడ్వాయి మండలం బంధాల గ్రామ పంచాయతీలోని పోచారంలోని మారుమూల ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అత్యవసర వైద్యం అందించేందుకు 'కంటెయినర్‌ ఆసుపత్రి'గా పేరుగాంచిన ప్రీఫ్యాబ్రికేటెడ్‌ ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఏర్పాటు చేసి జిల్లా యంత్రాంగం ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. 
 
అలాగే జిల్లాలోని కన్నాయిగూడెం మండలం అటవీ ప్రాంతంలో బంగారుపల్లి తండాలోని పిల్లల కోసం "కంటైనర్ స్కూల్" కూడా సిద్ధం అవుతోంది. 
 
అటవీ ప్రాంతాల్లో శాశ్వత నిర్మాణాలు చేపట్టడానికి అటవీ నిబంధనలు అనుమతించకపోవడంతో బంగారుపల్లి తండాలో నివాసముంటున్న గిరిజన సంఘాల పిల్లలు గుడిసెలు వేసుకుని చదువుకుంటున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 
 
మెరుగైన సౌకర్యం కల్పించేందుకు కలెక్టర్ టీఎస్ దివాకర కంటైనర్ పాఠశాల నిర్మాణానికి రూ.13 లక్షలు మంజూరు చేశారు. ఈ స్కూలును మంగళవారం ప్రారంభించనున్నారని తెలుస్తోంది.