1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
  4. Aadi Sai Kumar's Shambhala teaser on the difference between science and superstition

సైన్స్‌కి మూఢ నమ్మకం మధ్య తేడాతో ఆది సాయి కుమార్ శంబాల టీజర్

Aadi Sai Kumar
Aadi Sai Kumar
ఆది సాయి కుమార్ నటిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’. రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్, శివకార్తీక్ వంటి వారు నటిస్తున్నారు. రీసెంట్‌గానే ‘శంబాల’ మేకింగ్ వీడియోని కూడా రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు.
 
‘ఈ విశ్వంలో అంతు పట్టని రహస్యాలెన్నో ఉన్నాయి.. సైన్స్‌కి సమాధానం దొరకనప్పుడు మూఢ నమ్మకం అంటుంది.. అదే సమాధానం దొరికితే అదే తన గొప్పదనం అంటుంది’..  ‘పంచ భూతాలని శాసిస్తోందంటే ఇది సాధారణమైనది కాదు..  దీని ప్రభావం వల్ల మనం ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందో ఊహించలేం’.. ‘ఇప్పుడు ఈ రక్కసి క్రీడను ఆపాలంటే’.. అంటూ వచ్చిన వాయిస్ ఓవర్.. చూపించిన డైలాగ్స్‌తో సినిమా రేంజ్ ఏంటో అందరికీ అర్థం అవుతోంది.
 
ఇందులో ప్రవీణ్ కే బంగారి అందించిన విజువల్స్, శ్రీచరణ్ పాకాల ఇచ్చిన బీజీఎం అన్నీ కూడా నెక్ట్స్ లెవెల్లో ఉన్నాయి. పాన్ ఇండియన్ మూవీకి సరిపడా సబ్జెక్ట్, కంటెంట్ ఉందని ఈ టీజర్‌ చెప్పకనే చెప్పేస్తోంది. ఇక ఇందులో అంతరిక్షం నుంచి ఏదో ఒక అతీంద్రయ శక్తి ఉన్న ఉల్క, రాయి లాంటిది ఓ గ్రామంలో పడటం.. దాని ప్రభావంతో ఊర్లోని జనాలు చనిపోవడం, వింతగా ప్రవర్తించడం జరుగుతుంటుంది. దాన్ని ఛేదించేందుకు హీరో రావడం.. ఓ ఊరితో పోరాటం చేయడం వంటి ఆసక్తికరమైన అంశాలతో శంబాలను తెరకెక్కిస్తున్నారని టీజర్ చూస్తే అర్థం అవుతోంది. ఇక ఈ టీజర్‌తో మూవీ మీద ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు.
 
ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.
About Writer
దేవీ
తర్వాతి కథనం
బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం