ప్రిన్సిపాల్ సార్.. బెత్తంతో కొట్టండి.. ఒక పాఠశాల పాత విద్యార్థుల వింత కోరిక! (video)
old students
తమిళనాడు లోని ఒక పాఠశాల పాత విద్యార్థుల వింత కోరిక తీరింది. అదేంటంటే.. పాత విద్యార్థులంతా ఒకచోట కలిశారు. ఆ పాత విద్యార్థులలో కలెక్టర్లు, పోలీసు అధికారులు, వైద్యులు, న్యాయవాదులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వ్యాపారవేత్తలు ఇలా ఉన్నత పదవులను అలంకరించిన చాలామంది వున్నారు. వారందరికీ ఒకే కోరిక.
వారి గొప్ప పాఠశాల జీవితాన్ని గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రిన్సిపాల్ వారిని బెత్తంతో కొట్టాలి అనేదే. ఆ కోరికను కూడా ప్రిన్సిపాల్ నెరవేర్చారు. ఉన్నత పదవుల్లో వున్నారనే విషయాన్ని పక్కనబెట్టిన ప్రిన్సిపాల్.. వారిని బెత్తడం కొట్టారు. ఇలా ఆ పాత విద్యార్థుల వింత కోరిక నెరవేరింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.
????తమిళనాడు లోని ఒక పాఠశాల పాత విద్యార్థుల వింత కోరిక!
— Mr Yash (@YashTDP_) July 31, 2024
ఆ పాత విద్యార్థులలో కలెక్టర్లు, పోలీసు అధికారులు, వైద్యులు, న్యాయవాదులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వ్యాపారవేత్తలు మరియు పాఠశాలల యజమానులు ఉన్నారు! వారందరికీ ఒక కోరిక ఉంది.... వారి గొప్ప పాఠశాల జీవితాన్ని గుర్తుకు… pic.twitter.com/bv9l40UouG

