సంబంధిత వార్తలు
- అబ్బే నాకు ఆ ఆలోచనే లేదు.. ఆనంద్ మహీంద్రా
- మా నాన్న పేరు పెట్టడం ముమ్మాటికీ తప్పే : వైఎస్ షర్మిల
- మానవ హక్కులపై అమెరికాకు జైశంకర్ దీటైన జవాబు: మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానం మారిందా?
- 'భీమ్లా నాయక్'లో గర్జించే సింహాన్ని చూశా : హరీష్ శంకర్
- మల్టిపుల్ కోవిడ్ బూస్టర్ వ్యాక్సిన్లు రోగనిరోధక శక్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయా?
'ఎందుకంటే.. మేం భారతీయులం' .. రేసిస్ట్ అధికారికి బాలీవుడ్ నటుడు ఘాటు రిప్లై
బాలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు సతీశ్ షా జాతివివక్షను ఎదుర్కొన్నారు. లండన్‌లోని హిత్రూ విమానాశ్రయంలో ఆయనకు ఈ పరిస్థితి ఎదురైంది. కానీ, ఆయన ఎదుర్కొన్న తీరును, రేసిస్ట్ అధికారికి ఆయన చెప్పిన సమాధానంపై నెటిజన్లు అద్భుతం, శభాష్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే అంశంపై బాలీవుడ్ నటుడు ఓ ట్వీట్ చేశారు.
హిత్రూ విమానాశ్రయంలో తాను విమానం ఎక్కుతున్న సమయంలో ఎయిర్‌పోర్టు ఉద్యోగి ఒకరు తనను ఉద్దేశించి.. మీరు ఫస్ట్ క్లాస్ టిక్కెట్లు ఎలా కొనగలరని హేళనంగా ఉన్నాడని పేర్కొన్నారు. దీనికి తాను "ఎందుకంటే మేం భారతీయులం" అని గర్వంగా నవ్వుతూ సమాధానం చెప్పానని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
కాగా, షా ట్వీట్‌కు విపరీతమైన స్పందన లభించింది. సతీశ్ షాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వేలల్లో లైకులు వచ్చాయి. ఈ విషయం హిత్రూ విమానాశ్రయ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో వారు స్పందించి, సతీశ్ షాకు క్షమాపణలు చెప్పారు.
