శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 డిశెంబరు 2022 (16:50 IST)

అబ్బే నాకు ఆ ఆలోచనే లేదు.. ఆనంద్ మహీంద్రా

anand mahindra
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా దేశ ప్రజలు మెచ్చుకునే వ్యక్తులలో ఒకరు. నమ్మశక్యం కాని విజయవంతమైన వ్యాపారవేత్త మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో కూడా చాలా చురుకుగా ఉన్నారు. ఆనంద్ మహీంద్రా, పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఛైర్మన్ అనే విషయం అందరికీ తెలిసిందే. 
 
తాజాగా ఆనంద్ మహీంద్రా తాను దేశంలోని  ధనికుల జాబితాలో స్థానం పొందలేననే విషయాన్ని చమత్కారంగా చెప్పారు. భారతదేశపు అత్యంత ధనవంతుల జాబితాలో చోటు సంపాదించుకుంటారా అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.  
 
ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో దీనికి సమాధానమిస్తూ.. తాను ఎన్నడూ ఆ స్థానానికి చేరుకోవాలని కోరుకోనందున, తాను ఎప్పటికీ దేశంలో అత్యంత ధనవంతుడు కాలేనని పేర్కొన్నాడు. మహీంద్రా స్పందించిన విధానంపై నెటిజన్లు ఫిదా అవుతున్నారు.