శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 30 నవంబరు 2022 (10:01 IST)

పెళ్లి పీటల మీద ల్యాప్‌టాప్‌తో వర్క్ చేస్తున్న వరుడు - ఫోటో వైరల్

kolkata groom
కరోనా వైరస్ మహమ్మారి పుణ్యమాని ఐటీ ఉద్యోగులు తమ గృహాల నుంచి పని చేసే వెసులుబాటు కల్పించింది. అయితే, ఈ వర్క్ ఫ్రమ్ కొందరికి అనుకూలంగాను, మరికొందరికి ప్రాణ సంకటంగా మారింది. పలు కంపెనీలు వర్క్ ఫ్రమ్ పేరుతో ఉద్యోగులను పీల్చిపిప్పి చేస్తున్నారు. రేయింబవుళ్లు వర్క్ చేయించుకుంటున్నాయి. 
 
దీనికి నిదర్శనమే ఓ వరుడు పెళ్లి పీటల మీద కూర్చొని కూడా ల్యాప్‌టాప్‌తో కుస్తీ పడుతూ వర్క్ ఫ్రమ్ హోం విధులు నిర్వహిస్తున్నాడు. ఒకవైపు పురోహితుడు వేద మంత్రాలు చదువుతుంటే మరోవైపు వరుడు ల్యాప్‌టాప్‌లో పని చేస్తూ నిమగ్నమైపోయాడు. దీనికి సంబంధించిన పోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
 
పై ఫోటోలో కనిపిస్తున్న కోల్‌కతాకు చెందిన ఓ యువకుడు వర్క్ ఫ్రమ్ హోం విధానంలో పనిచేస్తూనే, మరోవైపు పెళ్లినాటి ప్రమాణాలు ఆచరిస్తుండటం సామాజిక మాధ్యమాల్లో విశేషంగా ఆకట్టుకుంటుంది. దీనిపై నెటిజన్లు తలోరకంగా స్పందిస్తున్నారు. 
 
వర్క్ ఫ్రమ్ హోం సంస్కృతిని మరో లెవల్‌కు తీసుకెళ్లిపోయాడని కొందరు అంటుంటే... ఉద్యోగాన్ని, వ్యక్తిగత జీవితాన్ని ఎలా సమతూకం చేసుకోవాలో ఈ యువకుడు నేర్చుకోవాలని మరికొందరు సూచన చేస్తున్నారు. పెళ్లి రోజున కూడా ఆ యువకుడిని ఆనందంగా ఉండనివ్వరా అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.