గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 10 నవంబరు 2022 (22:17 IST)

కుమార్తె వివాహానికి చిరంజీవిని ఆహ్వానించిన అలీ దంపతులు

ali - zubaida couple
టాలీవుడ్ హాస్య నటుడు అలీ దంపతులు గురువారం మెగాస్టార్ చిరంజీవిని కలుసుకున్నారు. తన కుమార్తె వివాహానికి రావాల్సిందిగా మెగాస్టార్‌ను అలీ దంపతులు ఆహ్వానించారు. అలీ వివాహం ఈ నెల 27వ తేదీన షెహనాజ్‌తో హైదరాబాద్ నగరంలోని అన్వయ కన్వెన్షన్ సెంటరులో జరుగనుంది. 
 
తమ కుమార్తె వివాహం నేపథ్యంలో అలీ దంపతులు అతిథులను ఆహ్వానించే పనిలో బిజీగా గడుపుతున్నారు. ఇటీవల సీఎం జగన్ దంపతులను కలిసి శుభలేఖ అందించి అలీ దంపతులు ఆ తర్వాత తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్‌ను రాజ్‌భవన్‌లో కలుసుకుని ఆహ్వాన పత్రిక అందజేశారు. గురువారం మెగాస్టార్ చిరంజీవిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. 
 
అలీ - జుబేదా దంపతులను చిరంజీవి తన నివాసంలోకి సాదరంగా ఆహ్వానించారు. వారిని ఆత్మీయంగా దగ్గరకు తీసుకుని తన వాత్సల్యాన్ని ప్రదర్శించారు. కుమార్తెకు పెళ్లి చేస్తున్న అలీ దంపతులను చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు.