సంబంధిత వార్తలు
- గుగూల్ మ్యాప్‌ను నమ్మి కారడవిలో చిక్కున్న కుటుంబం...
- Couple Romance: చెప్పుల షాపు కెళ్లి.. భార్యతో రొమాన్స్ (Video)
- King Cobra Viral Video: నడి రోడ్డుపై కింగ్ కోబ్రా.. ఆ వ్యక్తి తోక పట్టుకుని..? (video)
- 2 Men, 2 Wives, 1 Hotel: ఇద్దరు భార్యలతో ఇద్దరు భర్తలు.. (video)
- పిల్లిపిల్లను కాపాడిన వానరం.. ఎంత తెలివి? (video)
Google Maps: గూగుల్ మ్యాప్ ముంచేసింది.. దట్టమైన అడవుల్లోకి ఫ్యామిలీ.. రాత్రంతా?
Google Maps
వివరాల్లోకి వెళితే.. కర్నాటకలోని బెలగావి జిల్లాకు చేరుకున్న తర్వాత, అప్లికేషన్ వారికి ఒక చిన్న మార్గాన్ని చూపించింది. అది ఖాన్‌పూర్‌లోని దట్టమైన భీమ్‌ఘర్ అడవి గుండా వెళుతుంది. 8 కిలోమీటర్లు లోపలికి వెళ్లాక వారికి అది పొరపాటు అని అర్థమైంది. ఆ క్రమంలో కారు దట్టమైన అడవికి చేరుకున్నాక ఫోన్ నెట్ వర్క్ కూడా తగ్గిపోయింది. దీంతో వారు చేసేదేమి లేక రాత్రంతా అడవిలో గడిపారు.
తెల్లవారుజామున నిద్రలేచిన కుటుంబం నెట్‌వర్క్ కోసం నాలుగు కిలోమీటర్లు నడిచినట్లు పేర్కొన్నారు.ఆ క్రమంలో ఓ చోట నెట్ వర్క్ సౌకర్యం లభించగా వెంటనే ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ 112ను సంప్రదించారు. అప్పుడు పోలీసులు వచ్చి వారిని అడవి నుంచి బయటకు తీసుకొచ్చారు.
ఈ అడవి ప్రమాదకరమైన వన్యప్రాణులను కలిగివుందని పోలీసులు తెలిపారు. గత నెలలో కూడా గూగుల్ మ్యాప్స్ కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఇక తాజా ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలపై రకరకాలుగా కామెంట్లు వస్తున్నాయి.
