గుజరాత్‌లో వింత ఘటన.. బావిలో అలల్లా ఊగుతున్న నీరు.. వీడియో వైరల్ (video)
Well Waves
భారీ వర్షాల కారణంగా మూడు నెలల క్రితమే తవ్విన ఈ బావి నీటితో నిండు కుండలా కనిపిస్తోంది. గత పది రోజుల పాటు కురుస్తున్న వర్షాల కారణంగా బావి నిండిపోతుంది. అలా ఆ బావిలోని నీరు అలలుగా కదలడం చూసి స్థానికులు షాకవుతున్నారు. ఇలా గత ఆదివారం నుంచి బావి నీరు ఒక్కసారిగా మసకబారుతూ, అలల మాదిరిగా ఊగడం ప్రారంభమైంది.
గుజరాత్ మోర్బీ జిల్లాలో ఎలాంటి భూకంపం లేదా భూగర్భ ప్రకంపనలు నమోదుకాలేదని.. భూగర్భ శిలల మధ్య చిక్కుకున్న వాయువుపై వర్షపు నీటి ఒత్తిడి పెరగడం వల్లే ఈ కదలికలు ఏర్పడి ఉండొచ్చని జిల్లా జియాలజిస్టులు ప్రాథమికంగా అంచనా వేశారు. అసలు కారణాన్ని గుర్తించేందుకు భూగర్భ జల పరిశోధనా సంస్థ నిపుణులతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక సాంకేతిక విచారణకు ఆదేశించింది.
ALERT: ???? Strange phenominom occurring in the Indian town of Morbi, a water well KEEPS MOVING without any explanation.
— TRENDING ➞ 911 (@911NewsBreaks) August 7, 2026
Government sending in investigators. pic.twitter.com/vmdw1Bs2TT

