సంబంధిత వార్తలు
- పాడె మోసేందుకురాని ఆ నలుగురు.. సైకిల్‌పై శవాన్ని తరలించిన కుమారుడు
- 'అర్జున్ రెడ్డి' నటితో హీరో విశాల్ పెళ్లి... వరలక్ష్మి సంగతేంటి?
- చేతిలో చిల్లిగవ్వ లేదు.. లాయర్లకు డబ్బులు ఇచ్చుకోలేను...
- నీ భార్య కన్యేనా? అడిగిన పెద్దలు... పెళ్లి కుమారుడు ఏమన్నాడంటే?
- శోభనం ముగిసిన రోజు.. హ్యాపీగా వున్నావా? అని అడిగారు.. కన్యత్వ పరీక్షేనా?
పెళ్ళిపీటలపై కాబోయే భర్తను ఎడమకాలితో తన్నిన వధువు.. ఎందుకు?
పెళ్ళి కొడుకు ఎలా ఉన్నా అడ్జెస్ట్ చేసుకుని పెళ్ళి చేసుకోవాలి... ఇది పెద్దవారు పెళ్ళి చేసుకోబోయే అమ్మాయిలకు చెప్పే మాటలు. కానీ కలియుగంలో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. పెళ్ళికొడుకు ఎలాంటి వాడు... అతని అలవాట్లు ఎలాంటివో తెలిస్తే తప్ప పెళ్ళి చేసుకోవడంలేదు యువతులు. కానీ ఒక యువతి ఏకంగా పెళ్ళి చేసుకోబోయే భర్తనే కాలితో తన్నింది.
వివరాలు ఇలా వున్నాయి. పాట్నాకి సమీపంలోని తిలక్‌పూర్ గ్రామానికి చెందిన ఉదయ్ రజన్ అనే వ్యక్తికి అక్బర్‌పూర్‌కు చెందిన యోగేంద్ర రజక్ కుమార్తెకు వివాహానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ముహూర్తానికి పది నిమిషాలు ఉండగా ఉదయ్ రజన్ మద్యం సేవించినట్లు గుర్తించింది. దీంతో తాళిబొట్టు కడుతున్న సమయంలో అతడి నోటి నుంచి గుప్పుమంటూ మద్యం వాసన వచ్చింది.
అంతే.. ఒక్క ఉదుటున పైకి లేచి ఎడమకాలితో అతన్ని తన్నేసింది. మద్యం మత్తులో వున్న వరుడు ఆమె తన్నుకు దూరంగా పడిపోయాడు. అయితే రెండు కుటుంబాల వాళ్ళు యువతిని ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ ఆమె ఒప్పుకోలేదు. పెళ్ళే అవసరం లేదంటూ ఇంటికి వెళ్ళిపోయింది. వేరే దారి లేక పెళ్ళిని రద్దు చేశారు పెద్దలు.
