శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 10 జనవరి 2019 (09:13 IST)

చేతిలో చిల్లిగవ్వ లేదు.. లాయర్లకు డబ్బులు ఇచ్చుకోలేను...

పదేళ్ళ పాటు దేశ ప్రధానమంత్రిగా పని చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ వద్ద చిల్లిగవ్వ లేదట. ఈయన ప్రొఫెసర్‌గా, భారత రిజర్వు బ్యాంకు గవర్నరుగా, ఆర్థికవేత్తగా కూడా పని చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా, యూపీఏ ప్రభుత్వ హయాంలో పదేళ్ళ పాటు దేశ ప్రధాని పీఠంపై ఉన్నారు. ఇపుడు తన వద్ద డబ్బులు లేవని తన స్నేహితుడు యలమంచిలి శివాజీ వద్ద వాపోయారు. మన్మోహన్ సింగ్ ఇలా వ్యాఖ్యానించడానికి గల కారణాలు ఏంటో పరిశీలిద్ధాం. 
 
మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్'. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులోని కొన్ని సన్నివేశాలు మన్మోహన్‌ను కించపరిచేలా ఉన్నాయి. వీటిపై వివాదం చెలరేగింది. దీంతో కోర్టును ఆశ్రయించాలని పలువురు స్నేహితులు మన్మోహన్‌కు సూచించారు. 
 
వారివద్ద మన్మోహన్ చేసిన వ్యాఖ్యలు విని వారంతా షాకయ్యారు. తన వద్ద చిల్లిగవ్వ లేదనీ, కోర్టుకు వెళ్లి పోరాడేందుకు తన వద్ద డబ్బులు లేవని చెప్పారు. అంతేకాకుండా, న్యాయవాదులకు భారీగా ఫీజులు ఇచ్చుకునేందుకు తన వద్ద అడిగినంత డబ్బులు లేవని చెప్పారు.