సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 9 జనవరి 2019 (19:03 IST)

''ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్''‌లో సోనియా గాంధీగా ఎవరు? (video)

''ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్'' పేరుతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బయోపిక్ రెడీ అయ్యింది. ఇందులో మన్మోహన్ సింగ్ పాత్రను బాలీవుడ్ హీరో అనుపమ్ ఖేర్ పోషించారు.


ఈ సినిమా జనవరి 11వ తేదీన విడుదల కానుంది. ప్రస్తుతం ఈ పొలిటికల్ డ్రామాకు సంబంధించిన పోస్టర్లు విడుదల అయ్యాయి. ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యాక వివాదాలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ సినిమాకు అభ్యంతరం వ్యక్తం చేశారు. 
 
ఇంకా ఈ సినిమాపై గూగుల్, యూట్యూబ్ వేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఇలా అనేక వివాదాలకు నడుమ జనవరి 11వ తేదీన మన్మోహన్ సింగ్ జీవితంలో ప్రధాని పగ్గాలు చేపట్టిన ఘట్టాన్ని తెరకెక్కించిన ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ సినిమా విడుదలకు సిద్ధమైంది.

ఇందులో జర్మన్ యాక్టర్ సుజాన్నే బెర్నెర్ట్ కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ పాత్రలో కనిపించారు. అలాగే అహానా కుమార ప్రియాంకా గాంధీ రోల్‌లో కనిపిస్తోంది. అక్షయ్ కన్నా సంజయ్ బరు పాత్రలో మెప్పించనున్నారు. 
 
అర్జున్ మథూర్ రాహుల్ గాంధీగా, దివ్యసేథ్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సతీమణి గుర్‌శరణ్ కౌర్‌గా నటించింది. రామ్ అవతార్ దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిగా, అవతార్ సహ్ని ఎల్ కే అద్వానీగా, విమల్ వర్మ లాలూ ప్రసాద్ యాదవ్‌గా, అనిల్ రస్తోగి శివరాజ్ పటేల్‌గా, అజిత్ సత్.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుగా కనిపిస్తారు.