1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Cat circumambulate Lord Shani in Shani Shingnapur, Maharastra

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

Cat circumambulate Lord Shani
కర్మలకు అధిపతి శని భగవానుడు. చెడు కర్మలు చేసేవారికి శని భగవానుడు శిక్షలు విధిస్తాడని విశ్వాసం. అందువల్ల శనికి తైలాభిషేకం వంటివి చేస్తుంటారు మానవులు. ఐతే మనుషులు చేసే కర్మల సంగతి అటుంచితే తాజాగా మహారాష్ట్ర లోని శని సింగ్నాపూర్ లోని శనీశ్వరుని ఆలయంలో గత 3 రోజులుగా ఓ పిల్లి విరామం లేకుండా విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. సాధారణంగా పిల్లులు మనుషులను చూస్తే పారిపోతాయి. కానీ ఇక్కడ ఆ పిల్లి మాత్రం ఎంతమంది వచ్చినా పట్టించుకోవడంలేదు. తన ప్రదక్షిణలు చేస్తూనే వుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
 
కర్మలను బట్టి శనిదేవుడు ఫలితాలు
శని దేవుడిని న్యాయ దేవుడిగా, కర్మలకు అధిపతిగా భావిస్తారు. శని దేవుడు ప్రతి ఒక్కరికి తాము చేసిన కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడని నమ్ముతారు. శని దేవుడికి ప్రత్యేక పూజలు చేసిన వారికి సకల పాపాలు తొలగిపోతాయని, కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ఏలినాటి శని తొలగిపోతుందని విశ్వాసం.
 
శనికి తైలాభిషేకం చేయడం.. నెయ్యి లేదా ఆవాల నూనెతో దీపం వెలిగించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయి. శని దేవునికి పంచామృతంతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. శని మంత్రం, శని చాలీసా పఠించాలి. శనికి నలుపు రంగంటే ఇష్టమని అంటారు. అందుకని శని భగవానుడికి నలుపురంగు వస్త్రాలను దానం చేస్తే మంచిది. అలాగే నల్లని శునకానికి ఆహారం పెట్టినా కూడా ఆయన ప్రసన్నులవుతారు. శనీశ్వరునికి నువ్వులు లేదా ఆవనూనెతో దీపాన్ని వెలిగించాలి. 
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)