బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 16 అక్టోబరు 2024 (18:44 IST)

తనను కాటేసిన పామును మెడలో వేసుకుని ఆసుపత్రికి వచ్చిన వ్యక్తి (Video)

Man with snake
పాము కనబడిందంటే పారిపోతాము. అటువంటిది తనను కాటేసిన పామును పట్టుకుని, దాని నోటి వద్ద చేతితో గట్టిగా అదిమి పట్టి నేరుగా ఆసుపత్రికి వచ్చాడు ఓ వ్యక్తి. ఈ ఘటన బీహారు రాష్ట్రంలోని భాగల్‌పూర్‌లో చోటుచేసుకున్నది.
 
భాగల్ పూర్ కి చెందిన వ్యక్తిని రక్తపింజరి కాటేసింది. అంతే.. ఆ పామును ఒడిసిపట్టుకున్న సదరు వ్యక్తి చికిత్స కోసం ఆసుపత్రికి బయలుదేరాడు. పామును మెడలో వేసుకుని పాము నోటిని తన చేతితో గట్టిగా నొక్కి పట్టి తీసుకుని వచ్చాడు. అతడలా ఆసుపత్రికి రావడాన్ని చూసి అక్కడి జనం పరుగులు పెట్టారు. ఐనా అతడు అదేమీ పట్టించుకోకుండా తనకు చికిత్స చేయాలంటూ వైద్యుల వద్దకు వెళ్లాడు. పామును మెడలో వేసుకుని వచ్చిన అతడిని చూసి వైద్యులు కూడా చికిత్స చేసేందుకు భయపడిపోయారు. చివరకూ ఆ పామును ఓ సంచీలో బంధించి బాధితుడికి చికిత్స అందించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.