అబ్బాయిలకన్నా అమ్మాయిలే ముద్దులు కోసం ఎగబడ్డారు... మెట్రో స్టేషన్ లిఫ్టులో...

couple
జె| Last Modified శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (20:49 IST)
మెట్రో ట్రైన్‌లో లిఫ్టులను యువత అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేసుకుంది. ఒకరిద్దరు కాదు వందలాదిమంది యువతీ యువకులు లిఫ్టులలో తెగ ముద్దులు పెట్టేసుకుంటూ సి.సి.కెమెరాకు దొరికారు. అయితే లిఫ్టులో సి.సి.కెమెరా ఉందన్న విషయం తెలియని యువతీయువకులు రసపట్టులో కనిపించారు.

ఆ వీడియోలు కాస్త ఇప్పుడు వైరల్‌గా మారాయి. అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువగా ముద్దుల కోసం ఆరాటపడుతున్నట్లుగా వీడియోలో స్పష్టంగా కనబడుతోంది. గత నెలరోజుల వ్యవధిలో లిఫ్ట్‌లలో జరుగుతున్న ఈ బాగోతాన్ని రైల్వే అధికారులు బయటపెట్టారు.

ఉన్నత విద్యను అభ్యసించి దేశ అభివృద్ధికి పాటుపడాల్సిన యువత పెడదారి పడుతుండటంపై కొంతమంది నెటిజన్లు మండిపడుతున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్‌ల వేదికగా ఈ వీడియోలను షేర్ చేస్తూ తిట్ల వర్షం కురిపిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :