గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (19:18 IST)

పెళ్లైన 6 నెలలకే భర్త మరణం... తాళలేక ఇంటర్ విద్యార్థితో...

కట్టుకున్న భర్త ఆరునెలలకే అనారోగ్యంతో చనిపోయాడు. తల్లిదండ్రులు మళ్లీ పెళ్లి చేయలేదు. దీంతో విరహం తట్టుకోలేకపోయింది ఒక మహిళ. తన కోర్కెలు తీర్చుకోవడం కోసం ఒక యువకుడి జీవితాన్ని నాశనం చేసింది. విజయవాడలోని గాంధీనగర్‌లో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
 
రామ్మోహన్ విజయవాడలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. గుంటూరుకు చెందిన 24 యేళ్ల యువతిని ఇచ్చి వివాహం చేశారు. అయితే మద్యానికి బానిసైన రామ్మోహన్ గుండెపోటుతో చనిపోయాడు. దీంతో రామ్మోహన్ తల్లిదండ్రులతోనే కలిసి ఉంటోంది ఆ మహిళ. భర్త చనిపోవడంతో విరహం తట్టుకోలేకపోయింది. తాను నివాసముంటున్న ఒక అపార్టుమెంట్‌లో ఉన్న ఇంటర్ విద్యార్థితో స్నేహం పెంచుకుంది. ఇటీవలే అతడు జ్వరంతో కళాశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు ఆ విద్యార్థి.
 
దీన్నే అదునుగా భావించింది. విద్యార్థి ఇంట్లోకి వెళ్ళి తన కోర్కె తీర్చాలని ప్రాధేయపడింది. అయితే ఆ యువకుడు ఒప్పుకోలేదు. భయంతో పరుగులు తీశాడు. ఈ విషయాన్ని ఎక్కడ చెపుతాడోనని, ఆ మహిళ తనపై విద్యార్థి అత్యాచార యత్నానికి ప్రయత్నించాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ చివరకు పోలీసులు ఆమెను, విద్యార్థిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది. ఆ మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు పోలీసులు.