రష్యాలో దారుణం.. 56ఏళ్ల మహిళను పందులు తినేశాయి..
రష్యాలో దారుణం చోటుచేసుకుంది. పందులు నివసించే ప్రాంతంలో ప్రమాదవశాత్తు పడిపోయిన ఓ వృద్ధురాలిని చంపి తినేశాయి. ఈ ఘటన రష్యాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఉట్మర్టియా అనే మధ్య రష్యా ప్రాంతానికి చెందిన ఓ గ్రామంలో జంతువులకు ఆహారం అందించేందుకు ఇంటి నుంచి బయటికి వచ్చిన 56 ఏళ్ల మహిళకు ఫిట్స్ రావడంతో పందుల దొడ్డిలో పడిపోయింది.
అలా ప్రాణాలను కూడా కోల్పోయింది. అలా మృతి చెందిన మహిళను పందులు ఆహారంగా తినేశాయని ఆమె భర్త ఆవేదనతో వ్యక్తం చేశారు. మృతురాలి భర్త కూడా అనారోగ్యం కారణంగా ఉదయం పూట ఆలస్యంగా నిద్రలేచాడని.. ఆపై భార్యను వెతికితే ఆమె కనిపించలేదు.
చివరికి పందుల దొడ్డికెళ్లి చూస్తే అక్కడ తన భార్య మృతదేహం పందులు భుజించి దారుణమైన స్థితిలో వుందని రోదించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారని తెలిసింది.