చెల్లిని వ్యభిచారంలో ఇరికించిన అక్క

prostitute
Last Updated: బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (12:13 IST)
ఓ అక్క తప్పు చేసి.. చెల్లిని వ్యభిచారం కేసులో ఇరికించింది. ఈ ఘటన ఫ్లోరిడాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ప్లోరిడాకు చెందిన జాక్లీన్ హ్యూమినీ అనే యువతికి టీచర్ కావాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అందుకోసం ఆమె తీవ్రంగా కృషి చేస్తుంది. ఈ క్రమంలో ఆమె వ్యభిచారం చేస్తున్నట్టుగా పాటర్సన్ మున్సిపల్ కార్యాలయం నుంచి నోటీసులు వచ్చాయి. వీటిని చూడగానే ఆమె షాక్‌కు గురైంది. ఆ తర్వాత ఈ మొత్తాన్ని చెల్లించింది. పైగా, తాను ఏ చట్టాన్ని ఉల్లంఘించానో తెలియక పోయినప్పటికీ.. కేసు నుంచి విముక్తి పొందేందుకు ఆమె అపరాధం చెల్లించింది.

ఆ తర్వాత కొద్ది రోజులకు మళ్లీ ఇదే తరహా నోటీసులు వచ్చాయి. దీంతో ఆమె సందేహం వచ్చి పోలీసులను
ఆశ్రయించగా అసలు విషయం వెల్లడించారు. పైగా, తాను వ్యభిచారం చేయలేదనీ, నోటీసుల్లో పేర్కొన్న సమయంలో తాను పని చేసే కార్యాలయంలో ఉన్నట్టు ఆమె రికార్డులను చూపించింది. కానీ, తాము చేయగలిగింది ఏమీ లేదని చెప్పారు. చివరకు ఆమె ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని ఆశ్రయించింది. ఈ ఏజెన్సీ దర్యాప్తులో అసలు విషయం తేలింది.

ఇదంతా న్యూజెర్సీలో నివశిస్తున్న తన సోదరి పనేనని, మొదటిసారి నోటీసులు వచ్చినపుడే జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదని జాక్లీన్ వాపోయారు. ఎలాగైనా తనను ఈ కేసు నుంచి బయటపడేయాలని కోరారు. దీంతో ఆ సంస్థ పోలీసులను సంప్రదించింది. ఈ విషయంపై స్పందించిన వారు.. తమకు పరిస్థితి అర్థం అయ్యిందని, కానీ తామేమీ చేయలేమని చెప్పారు. ఆమె నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి అవసరయ్యే సాయం చేస్తామని మాత్రం హామీ ఇచ్చారు.దీనిపై మరింత చదవండి :