సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (16:54 IST)

చేతబడి చేస్తుందని.. వివస్త్రను చేశారు.. ఊరంతా తిప్పారు..

ఆధునిక యుగంలో మూఢ నమ్మకాలపై ఇంకా మోజు తీరని వారున్నారు. మన దేశంలో ఇప్పటికీ చేతబడి వంటి వాటిపై నమ్మకాలున్నాయి. చేతబడులను అడ్డంగా పెట్టుకుని హత్యలు, అరాచకాలు జరుగుతున్నాయి. తాజాగా జార్ఖండ్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. 50 ఏళ్ల మహిళ చేతబడి చేయడం వల్లే ఆ గ్రామంలో ఓ వ్యక్తి చనిపోయాడని నమ్మారు. 
 
ఊరంతా ఏకమై.. చేతబడి చేస్తున్న మహిళగా అభియోగాలు ఎదుర్కొన్న మహిళను చుట్టుముట్టారు. తానేపాపం చేయలేదని మొత్తుకున్నా.. చేతబడులు తెలియవని చెప్పిని ఒప్పుకోలేదు. ఆమెపైకి ఉరికారు. గ్రామ ప్రజలందరూ ఒక్కటై... ఆమె వేసుకున్న వస్త్రాల్ని లాగేశారు. ఊరి మధ్యలో అందరూ చూస్తుండగా... ఆమెను వివస్త్రను చేశారు. 
 
నగ్నంగా ఊరంతా తిప్పారు. ఆమె కూతురినీ, ఆమె కోడలిని చితకబాదారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.