సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (16:15 IST)

గూడ్స్ షెడ్డులో ప్రియుడితో ఎంజాయ్ చేసేందుకు వచ్చి రేప్‌కు గురైన యువతి...

భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) ఉన్న శ్రీహరి కోటకు సమీపంలో ఉన్న ప్రాంతం సూళ్లూరు పేట. ఇస్రో కారణంగానే ఈ ప్రాంతంలో ఉన్న రైల్వే స్టేషన్‌లో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగివెళుతున్నాయి. అలాగే, రైల్వే స్టేషన్‌ను కూడా బాగా అభివృద్ధి చేశారు. చెన్నై నుంచి సూళ్లూరుపేటకు ప్రతి గంటకూ సబర్బన్ రైళ్లు నడుస్తున్నాయి. అలాంటి రైల్వే స్టేషన్‌లో ఓ యువతి అత్యాచారానికి గురైంది. 
 
ప్రియుడు, ప్రియుడు స్టేషన్‌లో కూర్చొని మాట్లాడుతుండగా ఐదుగురు యువకులు వారిని అడ్డగించారు. ప్రియుడిని చితకబాది పట్టాల పక్కన పడేశారు. ఆ తర్వాత ఆ యువతిని రైల్వే ట్రాక్ పక్కన ఉన్న ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తన ప్రియురాలిని కాపాడుకునేందుకు తీవ్ర గాయాలతో లేచివచ్చిన ప్రియుడుని ఓ కామాంధుడు పట్టుకుంటే మిగిలిన నలుగురు ఆ యువతిని రేప్ చేశారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో జరిగింది. 
 
అంతటితో ఆగని ఆ కామాంధులు.. ఆ యువతిని రాత్రంతా చిత్రవధ చేశారు. వివస్త్రను చేశారు. చివరకు పోలీసు పెట్రోలింగ్ వాహనం సైరన్ విని పారిపోయారు. వీరిలో నలుగురుని పోలీసులు అదుపులోకి తీసుకోగా ఓ యువకుడు పారిపోయాడు. అత్యాచారానికి గురైంది విజయనగరం జిల్లాకు చెందిన 19 యేళ్ళ యువతిగా గుర్తించారు. అలాగే, యువకుడు కాకినాడ జిల్లా వాసి. వీరిద్దరూ శ్రీసిటీలో పని చేస్తూ ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ ఏకాంతంగా గడిపేదుకు సూళ్లూరుపేట రైల్వే స్టేషన్‌లో గూడ్సు షెడ్డు వద్దకు వచ్చారు. వారిని చూసిన ఐదుగురు యువకులు వారిపై ఉన్మాదంతో దాడి చేసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.