సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (12:07 IST)

వద్దన్నా.. ఇంటికొచ్చి మరీ అలా చేశాడు..

మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ప్రేమ పేరుతో యువతులపై వేధింపులు ఓవైపు.. అత్యాచారాలు మరోవైపు... ఇలా కఠినమైన శిక్షలు లేకపోవడంతో మహిళలపై అఘాత్యాలు ఏమాత్రం తగ్గట్లేదు. తాజాగా జగిత్యాల జిల్లా కథలాపూర్‌లో ప్రేమ వేధింపులు తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. కథలాపూర్‌ మండలం దుంపెటకు చెందిన హర్షిత(22) అనే యువతిని అదే గ్రామానికి చెందిన అల్లె దినేష్ కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అంతేకాదు, ఇటీవలే అతని తల్లిదండ్రులను ఆమె ఇంటికి పంపించి సంబంధం గురించి మాట్లాడించాడు. 
 
తనకు ఇష్టం లేకపోయినా ఇంటికొచ్చి మరీ పెళ్లి గురించి మాట్లాడటంతో హర్షిత తీవ్ర మనస్తాపానికి గురైంది. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.