గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (17:11 IST)

ఏం చెప్పమంటారు..? భార్యను ఏడు ముక్కలుగా నరికేశా.. అక్రమ సంబంధం..?

తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని పెరుంగుడిలో జనవరి 21వ తేదీ ఓ చెత్త లారీలో ఓ మహిళ చేతులు, కాళ్లు వంటి అవయవాలను పోలీసులు గుర్తించారు. చేతులు కాళ్లు మాత్రమే దొరకడంతో ఆ అవయవాలు ఎవరివని పోలీసులు తలపట్టుకున్నారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టారు.


ఈ నేపథ్యంలో తూత్తుకుడికి చెందిన సంధ్య హత్యకు గురైందని తెలిసింది. ఆ అవయవాలు ఆమెవేనని పోలీసులు కనుగొన్నారు. సంధ్యను భర్తే హతమార్చి.. ఏడు ముక్కలుగా నరికి పారేశాడని వాగ్మూలం ఇచ్చాడు.
 
వివరాల్లోకి వెళితే.. తూత్తుకుడికి చెందిన సంధ్యకు.. చెన్నై జాఫర్‌ఖాన్ పేటలోని అసిస్టెంట్ డైరక్టర్ బాలకృష్ణన్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. అయితే రెండు వారాల పాటు తన కుమార్తె కనిపించలేదని సంధ్య తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సంధ్య భర్త బాలకృష్ణన్‌పై పోలీసులకు అనుమానం ఏర్పడింది. అతనిని అరెస్ట్ చేసి పోలీసులు జరిపిన దర్యాప్తులో.. షాక్ ఇచ్చే నిజాలు వెలుగులోకి వచ్చాయి. 
 
ప్రాథమిక విచారణలో సంధ్యకు పలువురు పురుషులతో అక్రమ సంబంధం వుందని.. ఐదుసార్లు ఇంటి నుంచి పారిపోయిందని.. దీనిపై ఆమెను హెచ్చరించినా మార్పులేదని చెప్పాడు. దీంతో ఆవేశానికి గురైన బాలకృష్ణన్ జనవరి 20వ తేదీ సంధ్యను హత్య చేసి.. ఆమెను ఏడు భాగాలుగా నరికి వేర్వేరు ప్రాంతాల్లో విసిరేసినట్లు తెలిపాడు. ఇంకా ఆమె శరీర భాగాలను విసిరేసిన ప్రాంతాలను కూడా బాలకృష్ణన్ పోలీసులకు చెప్పాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు.