మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 7 ఫిబ్రవరి 2019 (09:57 IST)

డెలివరీ బాయ్‌తో భార్య రాసలీలలు.. కళ్లారా చూసిన భర్త.. ఏం చేశాడంటే...

డెలివరీ బాయ్‌తో ఓ మహిళ అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం ఆమె భర్తకు తెలిసి మందలించాడు. డెలివరీ బాయ్‌ను హెచ్చరించాడు. మరోసారి ఇటువైపు వస్తే చంపేస్తానని బెదిరించాడు. కానీ, కట్టుకున్న భార్యేకాదు.. ఆ డెలివరీ బాయ్ కూడా ఆయన మాట పెడచెవిన పెట్టారు. పైగా, తాను ఇంట్లో లేని సమయంలో డెలివరీ బాయ్ నేరుగా ఇంటికే వచ్చి తన భార్యతో రాసలీలల్లో మునిగిపోతున్నట్టు ఇరుగుపొరుగువారి ద్వారా తెలుసుకున్నాడు. అంతే తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన.. వారిద్దరినీ చంపేయాలని నిర్ణయించుకున్నాడు. చివరకు పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
స్థానిక టీ నగర్‌కు చెందిన ఓ మహిళకు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడమంటే మహాపిచ్చి. ప్రతి రోజూ ఏదో ఒక వస్తువును కొనుగోలు చేస్తూ ఉంటుంది. ఈ క్రమలో ఈ వస్తువులను డెలివరీ చేసేందుకు ఇంటికి వచ్చే ఓ డెలివరీ బాయ్‌ హరితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
కొంతకాలంగా గుట్టుచప్పుడుకాకుండా సాగుతూ వచ్చిన వీరి అక్రమ సంబంధం ఇటీవల భర్తకు తెలిసింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడై భార్యపై చేయి చేసుకున్నాడు. కొరియర్ బాయ్‌ హరితో తిరిగితే చంపేస్తానంటూ బెదిరించాడు. హరికి కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. అయితే, అటు భార్యగానీ, ఇటు కొరియర్ బాయ్‌గానీ ఆయన హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఎప్పటిలానే తమ బంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. వీలున్నపుడు ఇంట్లో.. వీలులేనపుడు బయట కలుస్తూ వచ్చారు. 
 
దీంతో తీవ్రంగా కలత చెందిన భర్త.. వారిద్దరినీ చంపేయాలని నిర్ణయానికి వచ్చాడు. ఈ క్రమంలో తొలుత సోమవారం కొరియర్ బాయ్ హరిని స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేశాడు. చెంగల్పట్టు డంపింగ్ యార్డ్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కత్తులు, కొడవళ్ళతో కిరాతకంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆ తర్వాత అతన్ని అక్కడే వదిలిపెట్టి ఆటోలో పారిపోయారు. 
 
ఈ దాడిలో తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో ఉన్న డెలివరీ బాయ్‌ను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చేరుకొని హరిని ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం చెంగల్పట్టు పరిసరాల్లో గాలించి మదన్‌తో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు ఖాకీలు. పోలీసులు హత్యాయత్నం, కిడ్నాప్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.