1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. If Children Are Chatting Rama Nama In Forest Area Deer Dance With Them

రామ మంత్రం మహిమ.. పిల్లలతో కలిసి కదం తొక్కిన జింక పిల్ల

Deer Dance With kids
Deer Dance With kids
రామ మంత్రం మహిమ అద్భుతం. రామ మంత్రాలను పఠించడం ద్వారా శ్రీరాముడి ఆశీస్సులతో పాటు హనుమంతుని అనుగ్రహాన్ని పొందవచ్చు. రామ మంత్రాన్ని పఠించడం ద్వారా సాధకుడికి మానసిక ప్రశాంతతతో పాటు ఆర్థిక లాభం కూడా కలుగుతుంది. 
 
జీవితంలోని అన్ని కష్టాలను దూరం చేయడానికి రామ రామేతి రామేతి, రామే రామే మనోరమే, సహస్రనామ తాతుల్యం, రామనామం వరాననే అనే తారక మంత్రాన్ని రోజుకు మూడుసార్లు పఠిస్తే చాలు.. విష్ణు సహస్రనామాన్ని పఠించిన ఫలితం ఖాతాలో పడిపోతుంది. 
 
ఈ రామ నామానికి వున్న మహిమ మనుష్యులకు బాగానే తెలుసు. అదే ఓ జింకకు తెలుసు అంటే నమ్ముతారా.. నమ్మి తీరాల్సిందే. రామ నామ మహిమ శాశ్వతం, సజీవం, సనాతనం, సర్వ వ్యాపం అనేదానికి జింక నిరూపించింది. 
 
అటవీ ప్రాంతాల్లో శ్రీరామ నవమిని పురస్కరించుకుని పిల్లలు రామనామ కీర్తనం చేస్తూ నృత్యం చేశారు. ఈ నృత్యానికి అక్కడున్న జింక కూడా ఫిదా అయ్యింది. 
 
పిల్లలతో కలిపి కదం తొక్కింది. రామ భజనకు తగినట్లు ఆ పిల్లలతో కలిసి జింక పిల్ల కూడా కదం తొక్కింది. ఈ వీడియోను బీఆర్ఎస్ నేత కేటీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
టిక్కెట్ చూపించమన్న టీటీఈ... రైలు నుంచి కిందికి తోసేసిన ప్రయాణికుడు!!