సంబంధిత వార్తలు
- నార్కోటిక్ టెస్టుల్లో నెగెటివ్ ఫలితం... ముందస్తు బెయిల్ పిటిషన్ వెనక్కి..
- తెలంగాణాలో ప్రధాని మోడీ రెండో రోజు పర్యటన.. షెడ్యూల్ ఇదే...
- పెళ్లి చేసుకోవాలంటూ యువతికి వేధింపులు.. ఇంటికెళ్లి కత్తితో దాడికి యత్నం
- ఖమ్మంలో కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ స్టోర్‌ను ప్రారంభించిన సాయి సిల్క్స్ కళామందిర్
- ప్రధాని మోడీపై యుద్ధం చేయం... రేవంత్ :: తెలంగాణా అభివృద్ధికి సహకరిస్తాం .. ప్రధాని మోడీ
ముగ్గురు పిల్లలను గొంతుకోశాడు.. తర్వాత ఉరేసుకున్నాడు.. ఎందుకని?
తెలంగాణలోని రంగారెడ్డిలో ఓ వ్యక్తి తన ముగ్గురు పిల్లలను హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం టంగుటూరు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రవి (35) అనే వ్యక్తి 6 నుంచి 13 ఏళ్ల వయసున్న తన ముగ్గురు కుమారులను హత్య చేసి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
పిల్లలను గొంతుకోసి హత్య చేసి తానూ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అధిక రాబడులు ఇస్తానని ఆ వ్యక్తి కొందరిని మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కీమ్‌లో చేర్చుకున్నాడని పోలీసులు తెలిపారు. వాగ్దానం చేసిన మొత్తాన్ని నిర్ణీత వ్యవధిలో తిరిగి చెల్లించకపోవడంతో గ్రామస్తులు డబ్బులు డిమాండ్ చేయడం ప్రారంభించారు.
ఈ విషయమై రవి తన భార్యతో గొడవ పడ్డాడని, ఆమె తమ ఆరేళ్ల కుమారుడిని వదిలి తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కానీ చనిపోయేటప్పుడు తన ముగ్గురు కుమారులను గొంతు కోసం చంపి, ఆపై ఉరివేసుకున్నాడు.
