సంబంధిత వార్తలు
- నా భార్యను తిట్టారు... అందుకే నేను బూతులు తిట్టా : నిజాన్ని అంగీకరించిన పోసాని
- మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!
- మీర్ పేట మాధవి హత్య కేసు: నాకు బెయిల్ వద్దు, లాయర్లు వద్దు అని న్యాయమూర్తి ఎదుట గురుమూర్తి
- డోనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చిన అమెరికా కోర్టు!!
- Greeshma case judgement, ప్రియుడిని గడ్డి మందుతో చంపేసిన ప్రియురాలు: ఉరిశిక్ష విధించిన కేరళ కోర్టు
No mangalsutra, bindi? మెడలో మంగళసూత్రం, నుదుట సింధూరం లేదు.. నీపై భర్తకు ఎలా ఇంట్రెస్ట్ వస్తుంది?
mangalsutra
భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాల కారణంగా ఓ భార్య కోర్టుకెక్కింది. భర్తపై గృహహింస కేసు పెట్టింది. ఈ కేసు విచారణలో భాగంగా భార్యాభర్తలు పూణే జిల్లా కోర్టుకు హాజరయ్యారు. ఈ వ్యహారంలో జడ్జి కీలక వ్యాఖ్యలు చేసి ఇద్దరి మధ్య రాజీకుదిర్చే ప్రయత్నం చేశారు. ఇరువురి వాదనలు విన్న తర్వాత జడ్జి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇంకా జడ్జి చేసిన వ్యాఖ్యల్లో ఏమున్నాయంటే.. "మెడలో మంగళసూత్రం లేదు, నుదిటిపై బొట్టు కూడా లేదు. మీరు ఒక వివాహితగా ప్రవర్తించకుంటే అలాంటప్పుడు మీ భర్తకు ఎలా మీపై ఇంట్రెస్ట్ వస్తుంది? ఒక మహిళ బాగా సంపాదిస్తే తనకన్నా ఎక్కువగా సంపాదించే మగాడిని వివాహం చేసుకోవాలనుకుంటుంది. తనకన్నా తక్కువ సంపాదించే మగాడితో సంసారం చేయాలని కోరుకోదు.
అయితే పురుషుడి విషయంలో అలా వుండదు. బాగా సంపాదించే మగాడు వివాహం చేసుకోవాలి అనుకుంటే.. తన ఇంట్లో పనిచేసే పనిమనిషిని కూడా పెళ్లి చేసుకోవచ్చు. పురుషులు అలా ఫ్లెక్సిబుల్‌గా వున్న పక్షంలో మహిళలు కూడా కాస్త మారాలి. మొండిగా కఠినంగా వుంటే ఎలా అంటూ జడ్జి ప్రశ్నించారు.
దీంతో జడ్జి వ్యాఖ్యలు విని ఆ మహిళ షాక్ అయింది. ఈ కేసు ఇంకా కోర్టులో పెండింగ్ వుంది. కానీ వివాహిత లాయర్ అంకుర్ జవాగిర్దార్ జడ్జి వ్యాఖ్యలను తప్పుబట్టారు. జడ్జి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను తన లింక్డ్ ఇన్‌లో పోస్టు చేశారు.
