1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. PM Narendra Modi gets highest approval rating among global leaders, finds US survey

ప్రపంచంలో మంచి ప్రజామోదం కలిగిన నేతగా ప్రధాని మోడీ

Narendra Modi
భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ప్రజాదారణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్క మన దేశంలోనేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు మంచి పేరుంది. అయితే, తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో మరోమారు మంచి ప్రజదారణ కలిగిన నేతగా మరోమారు ఎంపికయ్యారు. 
 
ముఖ్యంగా, భారత్‌లోని వయోజనుల్లో 71 శాతం మోడీని తమ నేతగా ఆమోదిస్తున్నారు. ఈ వివరాలను అమెరికుక చెందిన గ్లోబల్ లీడర్ అప్రూవల్ ట్రాక్ మార్నింగ్ కన్సల్ట్ వెల్లడించింది. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 13 మంది నేతలకు సంబంధించి సర్వే నిర్వహించింది. 
 
ఇందులో 71 శాతం మంది ప్రజామోదంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అగ్రస్థానంలో నిలించారు. అంతేకాకుండా అతి తక్కువ తిరస్కరణ రేటు అంటే 21 శాతం కూడా ఆయనకే దక్కింది. ఆ తర్వాత మెక్సికో అధినేత మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడర్ 66 శాతం రేటింగ్‌తో రెండో స్థానంలో ఉన్నారు. 
 
ఇజ్రాయేల్ ప్రధాని మారియో 60 శాతం, జపాన్ ప్రధాి కిషిదకు 48 శాతం ప్రజాదారణ లభించింది. ఈ 13 మందిలో బ్రిటన్ అధినేత బోరిస్ జాన్సన్‌కు కేవలం 26 శాతం మాత్రమే లభించడంతో జాబితాలో ఆఖరి స్థానంలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు 43 శాతం ప్రజామోదం లభించింది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఏపీలో మధ్యాహ్నం భోజన పథకం మెనూలో మార్పులు