1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. renu desai personal matters revealed with national channel

మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ దేవుడా? రెండో పెళ్లి చేస్కుంటున్న నేను అలాంటిదాన్నా?

రేణూ దేశాయ్ తన పెళ్లి సమీపిస్తున్నకొద్దీ తన మాటలకు పదును పెంచుతోంది. తను రెండో పెళ్లి చేసుకోవడంపై కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమె చేస్తుంది తప్పూ అంటూ వ్యాఖ్యలు పోస్ట్ చేయడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్విట్టర్ ట్రోలింగ్ కావడంతో దాన్ని మూసివేశా

renu desai
రేణూ దేశాయ్ తన పెళ్లి సమీపిస్తున్నకొద్దీ తన మాటలకు పదును పెంచుతోంది. తను రెండో పెళ్లి చేసుకోవడంపై కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమె చేస్తుంది తప్పూ అంటూ వ్యాఖ్యలు పోస్ట్ చేయడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్విట్టర్ ట్రోలింగ్ కావడంతో దాన్ని మూసివేశారు. ఐతే తను రెండో పెళ్లి చేసుకోవడంపై ఆమె తన భావాలను వ్యక్తీకరించారు.
 
మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కళ్యాణ్‌ను దేవుడు అంటున్నారు, ఆయనను అభిమానిస్తున్నారు కానీ రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న నన్ను ఇలా ఎందుకు నిందిస్తున్నారంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు. మగాడు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా అతడిని సమాజం సెలబ్రిటీగానే చూస్తోంది. కానీ స్త్రీ విషయానికి వచ్చేసరికి తేడా చూపిస్తోంది. మహిళల స్వేచ్ఛను రెండు కాళ్ల మధ్య దాచేసిన సమాజంలో వుంటున్నాం. మహిళను ఓ వస్తువుగా మాత్రమే చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. 
 
పురుషుల కంటే మహిళలు శారీరకంగా కాస్త బలహీనులే కావచ్చు కానీ మిగిలిన అన్ని విషయాల్లోనూ సమానులే. ఐతే ఈ సమానత్వం మన సమాజంలో ఎందుకు రావడంలేదో అర్థం కావడం లేదంటూ వ్యాఖ్యానించింది. భవిష్యత్తులో తన కుమారుడు ఎవరైనా యువతిని తప్పుగా భావిస్తే నా కుమారుడి కోణంలో కాకుండా యువతి కోణంలో నేను ఆలోచిస్తానని అంటోంది. దీన్నిబట్టి పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కోణంలో నుంచి కాకుండా రేణూ దేశాయ్ కోణంలో నుంచి చూడాలన్నమాటేగా.
About Writer
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి
తర్వాతి కథనం
భర్తకు నోటి క్యాన్సర్- శృంగారం కావాలన్నాడు.. భార్య నో చెప్పేసరికి చంపేశాడు..