Sajjanar: ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు అవసరమా?: సజ్జనార్ ప్రశ్న
Sajjanar
ఈ విషయాన్ని హైలైట్ చేయడానికి వి.సి. సజ్జనార్ ఇటీవల ట్విట్టర్‌లో ఒక ఫోటోను షేర్ చేస్తూ, "ప్రమాదాలు తెలిసినప్పటికీ, కొంతమంది వ్యక్తులు ఇటువంటి ప్రమాదకరమైన ప్రయాణాలు చేస్తున్నారు.
సమయం ఆదా చేయడానికీ లేదా త్వరగా తమ గమ్యస్థానాన్ని చేరుకోవాలనే ఆత్రుత వల్ల అయినా.. కారణం ఏదైనా ఇలా ప్రయాణించడం ఒకరి ప్రాణాలతో ఆడుకోవడంతో సమానం. ఊహించని ప్రమాదం జరిగితే, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రజలు గ్రహించలేకపోతున్నారు" అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
