1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. The prisoner escaped while being taken from the jail to the court

సినిమా స్టైల్‌లో.. కోర్టుకు తరలిస్తుండగా ఖైదీ పరార్..

jail
సినిమాల్లో ఖైదీలను కోర్టుకు తరలిస్తుండగా వారు పారిపోవడం చూసే వుంటాం. తాజాగా సినీ ఫక్కీలో అనకాపల్లిలో ఓ ఖైదీ కోర్టును తరలిస్తుండగా.. పారిపోయాడు. 
 
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలోని లక్ష్మీపురంకు చెందిన పిల్లా నూకరాజు (31) అనే వ్యక్తి విశాఖ సెంట్రల్ జైలులో రిమాండ్‌లో వున్నాడు. 
 
నిందితుడిని జైలు నుంచి ఎలమంచిలి కోర్టుకు తీసుకు వెళ్లే క్రమంలో తప్పించుకున్నాడు. రెస్ట్ రూమ్ వెళ్లొస్తానని చెప్పి.. ఎలమంచిలి ఆర్టీసీ బస్టాండ్‌లో పారిపోయాడు. 
 
ఈ ఘటనపై ఎలమంచిలి పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పారిపోయిన ఖైదీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 
తర్వాతి కథనం
గాజాలో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ సేవలు కట్