కన్య
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఈ మాసం ద్వితీయార్ధం అనుకూలం. కార్యసిద్ధి, వ్యవహారజయం పొందుతారు. గత కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగుతాయి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు భారమనిపించవు. శుభలేఖ అందుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. కొత్త యత్నాలు చేపడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అపోహలకు గురికావద్దు. అర్ధాంతంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంభాషిస్తారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం, ఉద్యోగస్తుల కార్యక్రమాలు యధావిధిగా సాగుతాయి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. సంస్థల స్థాపనలకు అనుకూలం.