వృశ్చికం
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆర్ధికంగా బాగుంటుంది. ఖర్చులు అధికం. వాహనం కొనుగోలు చేస్తారు. మీ ఉన్నతి కొందరికి అసూయ కలిగిస్తుంది. చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు. కొత్తపనులు చేపడతారు. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. ఆహ్వానం అందుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. తరుచు సన్నిహితులతో సంభాషిస్తుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సోదరులను సంప్రదిస్తారు. ఎదుటివారి అభిప్రాయాలకు ప్రాధాన్యమివ్వండి. అనాలోచితంగా వ్యవహరించవద్దు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. ఉపాధ్యాయులకు అదనపు బాధ్యతలు, ప్రేమవ్యవహారం వివాదాస్పదమవుతుంది.