కత్తి మహేష్ కు రీప్లేస్‌గా పోసాని? - సర్వే రిపోర్ట్
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణాలోనూ ప్రజల పాలనకంటే పవన్ వ్యాఖ్యలపై పోసాని కృష్ణమురళి కౌంటర్లు హాట్ టాపిక్‌గా మారాయి. పోసాని వాడిన బాష భావదారిద్రంగా వుందని సినీ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. ఇప్పటికే రాజకీయ నాయకులు వాడే భాష, మాట్లాడే తీరును చూస్తుంటే మానవత్వం వున్నవాడు తల దించుకునేలా వుంటున్నాయి. కాలం మారినా ఇంకా అనాగరికంగా వాడే భాషను మాట్లాడే వారు వుంటూనే వున్నారు. వారంతా వ్యక్తిగతంగా లబ్దిపొందుతూ సమాజాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని మేథావులు విమర్శిస్తున్నారు. కనుక ఇలాంటివాటికి చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా వుందని, ఇంకా శ్రుతిమించితే హైకోర్టు ఇలాంటి వారిపై చర్య తీసుకోవాల్సిన అవసరం వుంటుందని పలువురు సినీ ప్రముఖులు తెలియజేస్తున్నారు.
ఒకప్పుడు పవన్ గురించికానీ, సినిమా వాళ్ళ గురించి కానీ మాట్లాడాలనుకుంటే వై.ఎస్. జగన్ ప్రభుత్వం కొందరినీ పావులుగా వాడుకునేది. అందులో భాగంగానే సినీ విశ్లేషకుడుగా వున్న కత్తి మహేష్‌ను వినియోగించుకుంది. ఓ ప్రముఖ టీవీ ఆయన్ను హైలైట్ చేస్తూ, ఆయన మాటలకు పదేపదే చూపిస్తూ ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా మాట్లాడేలా చేసుకుంది. కట్ చేస్తే కత్తిమహేష్ దురదృష్టవశాత్తు మరణించడంతో ఆ ప్లేస్ ను భర్తీచేయడానికి పోసానిని వినియోగించుకుంటుందని పలువురు మేథావులు అంచనావేశారు. అందుకు తగినట్లుగా పోసాని వ్యవహారశైలికూడా వుండడంతో ఫిలింనగర్‌లో పోసాని మరో కత్తిమహేష్ అంటూ టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ను చిన్న నిర్మాతలంతా వాడు మగాడ్రులా బుజ్జి అంటూ సంబోధిస్తున్నారు.