శుక్రవారం, 6 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 సెప్టెంబరు 2021 (12:32 IST)

పోసాని ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల రాళ్ళదాడి

హైదరాబాద్ నగరంలో సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ళదాడికి పాల్పడ్డారు. అమీర్‌పేట ఎల్లారెడ్డిగూడలోని పోసాని ఇంటిపై బుధవారం అర్థరాత్రి 2 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. 
 
పోసానిని దుర్భాషలాడుతూ వీరంగం సృష్టించారు. దీంతో భయాందోళనకు గురైన వాచ్‌మెన్.. ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాచ్‌మెన్ ఫిర్యాదుతో పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు.
 
కాగా, ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పోసాని బూతుల వర్షం కురిపించడంతో జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోసాని ఇంటిపై దాడి జరగడం సంచలనం సృష్టిస్తోంది. నిజానికి పోసాని కృష్ణమురళి కుటుంబం 8 నెలలుగా వేరే చోట నివాసం ఉంటోంది. ఆ విషయం తెలియని దుండగులు, పోసాని ఎల్లారెడ్డిగూడలోని ఇంట్లోనే ఉంటున్నారనుకుని దాడికి పాల్పడ్డారు.