1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. nagasuri venugopal

ఘనంగా 'చర్చనీయాంశంగా చానళ్ళు' పుస్తకావిష్కరణ!

nagasuri
ప్రముఖ రచయిత, డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ రచించిన 'చర్చనీయాంశంగా చానళ్ళు' పుస్తకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. తేజస్ ఆధ్వర్యంలో ఆదివారం రోజు ఆస్కా ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ సీనియర్ సంపాదకులు కె.రామచంద్రమూర్తి ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. 
 
అనంతరం రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. తరతమ భేదం లేకుండా కేవలం వస్తు దృష్టితో  చానళ్ల పనితీరును సమీక్షించిన కొద్ది మందిలో నాగసూరి వేణుగోపాల్ ఒకరన్నారు. ఆయనది సద్విమర్శ మాత్రమేనన్నారు. చానళ్ల నిర్వహణ అనేది కత్తి మీద సాము వంటిందని, క్షణాలతో పోటీ పడుతూ 24 గంటలూ పరుగు తీస్తుండాలన్నారు. అనుక్షణం మెలకువగా, జాగ్రత్తగా ఉండడం ఎంతో కష్టసాధ్యమన్నారు. 
 
ప్రతి చానళ్ళను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతనే వ్యాసం రాస్తారని నాగసూరికి తెలిపారు. ఈ వ్యాసాల ద్వారా తప్పొప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉందన్నారు. ఇంతలా సుదీర్ఘంగా చానళ్ళను పరిశీలిస్తున్న వారు మరొకరు లేరని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి డైరెక్టర్ కె.సుబ్రమణియన్, తేజస్ నిర్వాహకులు, పలువురు తెలుగు ప్రముఖులు పాల్గొన్నారు. 
About Writer
CVR