సంబంధిత వార్తలు
- టిడిపిలో ఇప్పటి వరకు ఒక లెక్క..! ఇకనుండి మరో లెక్క
- నీ భర్త చాలా సెక్సీ, ప్రియుడి భార్యకు ప్రియురాలు టార్చర్, చివరికి?
- కోవిడ్-19 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీ ఎంటర్టైన్మెంట్ 10 అంబులెన్సులు, 4000 పీపీఈ కిట్లు విరాళం
- ఇంట్లో కాలు జారిపడిన నృత్య కళాకారిణి శోభా నాయుడు ఇకలేరు...
- నా భర్త ఎప్పుడూ జెసీబీలు, ట్రాక్టర్లు తోలుకుంటూ తిరుగుతుంటాడు, అందుకే సూది మందుతో చంపించేసా
16 నుంచి ఏకాంతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆలయంలోనే ఏకాంతంగా జరగనున్నాయి. ఈ ఏడాది అధికమాసం కావడంతో స్వామివారికి రెండు సార్లు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు.
గత నెలలో నిర్వహించిన వార్షిక ఉత్సవాలను ఏకాంతంగా ఆలయంలోనే నిర్వహించిన తితిదే.. ఈ నెల 16 నుంచి 24వ తేదీ వరకు జరగనున్న నవరాత్రి ఉత్సవాలను తిరువీధుల్లో భక్తుల మధ్య నిర్వహించాలని ముందుగా భావించి అందుకు తగిన ఏర్పాట్లు చేసింది.
అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా వెల్లడించిన కొవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నవరాత్రి ఉత్సవాలను ఈసారి కూడా ఏకాంతంగానే నిర్వహించనునన్నట్లు మంగళవారం తితిదే ప్రకటించింది. ఈవో జవహర్‌రెడ్డి అధ్యక్షతన తితిదే ఉన్నతాధికారులు పలు మార్లు సమీక్షలు నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తితిదే తెలిపింది.
చిత్తూరు జిల్లాలో కరోనా పాజిటీవ్ కేసులు పెరుగుతుండటం.. ఉత్సవాలు, మతపరమైన కార్యక్రమాలకు 200 మందికి మించి నిర్వహించకూడదని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
తర్వాతి కథనం
