1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. 10 Skoch Awards for Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గోల్డ్ - సిల్వర్ స్కోచ్ అవార్డులు

Skoch Awards
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధికంగా స్కోచ్ అవార్డులు అవరించాయి. స్కోచ్ గ్రూపు 78వ ఎడిషన్‌లో భాగంగా జాతీయ స్తాయిలో ఈ అవార్డులను ప్రకటించింది. ఇందులో అత్యధిక అవార్డులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వరించాయి. దశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 113 నామినేషన్స్ రాగా, వాటిలో ఏపీకి వివిధ కేటగిరీల్లో ఐదు బంగారం, ఐదు వెండి స్కోచ్ అవార్డులు వరించాయి. ఢిల్లీలో నిర్వహించి వెబినార్‌లో స్కోచ్ గ్రూపు ఎండీ గురుశరణ్ దంజల్ ఈ అవార్డుల వివరాలను వెల్లడించారు. 
 
అవార్డులు పొందిన పథకాలను పరిశీలిస్తే, సంక్షేమ పథకాలైన వైఎస్ఆర్ చేయూత, ఆసరా, నేతన్న నేస్తం పథకాలతో పాటు షిఫ్ ఆంధ్ర కార్యక్రమానికి గిరిజన ప్రాంతాల్లో బలవర్థకమైన ఆహారాన్ని సాగు చేస్తున్న సాగు చేస్తున్న విజయనగరం జిల్లాకు గోల్డ్ స్కోచ్ అవార్డులు వరించాయి. అలాగే వివిధ విభాగాల్లో ఈ అవార్డులు దక్కాయి. 
తర్వాతి కథనం
CSIR UGC NET 2021: పరీక్ష రాసే అభ్యర్థులకు కీలక సూచన...