విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమంగా రోడ్డు మార్గం ద్వారా గంజాయిని మహారాష్ట్రకు తరలిస్తున్నట్లుగా నగర పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులుకు వచ్చిన సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిందితులను అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ ఏడిసిపి డాక్టర్ కె.వి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏసిపిలు టి.కనకరాజు, వి.ఎస్.ఎన్.వర్మ, ఇన్‌స్పెక్టర్ పి.కృష్ణమోహన్, ఎస్.ఐ.లు రవితేజ, శేషారెడ్డి మరియు వారి సిబ్బందితో విజయవాడ, మాచవరం పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామవరప్పాడు రింగు,...