శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 20 జూన్ 2020 (17:46 IST)

ఏపీలో పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు - విద్యార్థులంతా పాస్

ఏపీలో పదో తరగతి, ఇంటర్  సప్లిమెంటరీ పరీక్షలు రద్దయ్యాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ మేరకు శనివారం ప్రకటించారు. "తప్పనిసరిగా పరీక్షలు చేపట్టాలని అనుకున్నాం.

పరీక్ష విధానంలో మార్పులు చేసాం.11 పేపర్లు బదులు ఆరు పేపర్లు పెట్టాలని అనుకున్నాం. భౌతిక దూరం పాటిస్తూ పరీక్ష కేంద్రాలు కూడా పెంచాం. అన్ని రకాలుగా ముందస్తు జాగ్రత్తలు చేసుకున్నాం. కరోనా ప్రభావం, విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నాం.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి రద్దు నిర్ణయం తీసుకున్నాం. కరోనా ప్రబలుతున్న సమయంలో ఏ తల్లి తన బిడ్డ ఆరోగ్యం గురించి బెంగపెట్టుకోకూడదని సీఎం జగన్ చెప్పారు" అని ప్రకటించారు.