శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 16 జూన్ 2020 (21:29 IST)

శ్రీవారి భక్తులు, పార్టీ కార్యకర్తల కోసం వైవీ యాప్

తనను వ్యక్తిగతంగా కలిసి సమస్యలు చెప్పుకోలేని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తుల నుంచి సలహాలు, సూచనలు, ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానూల సమస్యలు తెలుసుకోవడానికి టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రత్యేక యాప్ విడుదల చేశారు.

ఈ యాప్ ను మంగళవారం తాడేపల్లి లోని తన నివాసంలో  సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తులు, ప్రజలు, కార్యకర్తలు తనను వ్యక్తిగతంగా కలవడానికి వ్యయ ప్రయాసలు పడకుండా వారికి మరింత దగ్గర కావడానికి ఈ యాప్ ను ఉపయోగించుకుంటానని చెప్పారు.

యాప్ ద్వారా శ్రీవారి భక్తులు తిరుమలతో పాటు అనుబంధ ఆలయాలు, టీటీడీ పరిపాలనకు సంబంధించిన సలహాలు, సూచనలు తన దృష్టికి తేవచ్చునని ఆయన చెప్పారు. అలాగే ప్రజలు, కార్యకర్తలు వారి ఇబ్బందులు కూడా తెలియజేయవచ్చునని ఆయన అన్నారు.

సమస్యలు మరింత వేగంగా పరిష్కరించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు ఆయన చెప్పారు. గూగులే ప్లే స్టోర్ , లేదా ఆపిల్ ఐ స్టోర్ లో yvsubbareddy అనే యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.