శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 18 జూన్ 2020 (17:30 IST)

రేపు ఏపీలో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్ లో 4 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీ నుంచి నలుగురు, టీడీపీ నుంచి ఒకరు బరిలో నిలిచారు.

శాసనసభ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు మాక్ పోలింగ్ నిర్వహించారు.

మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణతో పాటు అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని  వైసీపీ నుంచి బరిలో వుండగా,  టీడీపీ నుంచి వర్ల రామయ్య పోటీలో ఉన్నారు.