శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 17 జూన్ 2020 (08:49 IST)

అమ్మ లీనా?.. ఎంత పని చేశావే?.. సీబీఐ అధికారి పేరుతో రాయపాటికి బెదిరింపులు

సీబీఐ అధికారులమంటూ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావును బ్లాక్ మెయిల్ చేసింది మలయాళ నటి లీనా, ఆమె ప్రియుడు సుఖేశ్ చంద్రశేఖర్‌ లుగా సీబీఐ అధికారులు గుర్తించారు.

‘రెడ్ చిల్లీస్’, ‘మద్రాస్ కేఫ్’ చిత్రాల్లో హీరోయిన్‌గా లీనా నటించారు. నటి లీనా పరారీలో ఉండటంతో ఆమె కోసం గాలిస్తున్నారు. లీనాపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

ఈ కేసులో లీనా అనుచరులు మణివర్ధన్, సెల్వరామరాజు, అర్చిత్‌లను కూడా అరెస్ట్ చేశారు. జనవరిలో రాయపాటి ఇంటికే వచ్చి లీనా అనుచరుడు డబ్బు డిమాండ్ చేశాడు.

దీంతో రాయపాటి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. గతంలో తమిళ నేత టీటీవీ దినకరన్‌ను కూడా ఇలానే లీనా బెదిరించినట్లు తెలిసింది.