మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 20 జూన్ 2020 (17:22 IST)

రేపు శ్రీశైలం మల్లన్న ఆలయం మూసివేత

సూర్య గ్రహణం కారణంగా ఆదివారం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఆలయాన్ని మూసివేస్తున్నట్లు దేవస్థానం ఈవో రామారావు తెలిపారు. శనివారం రాత్రి 10 గంటలకు ఆలయ ద్వారాలు మూసివేసి 21వ తేదీన సాయంత్రం 4.30 గంటలకు తెరువనున్నట్లు ఈవో చెప్పారు.

సాక్షి గణపతి, హఠకేశ్వరం, శిఖరేశ్వరం ఆలయాలు కూడా మూసివేస్తున్నట్లు చెప్పారు. సూర్య గ్రహణం రోజు పరోక్ష సేవలను కూడా నిలుపుదల చేస్తున్నట్లు ఈవో తెలిపారు.

శ్రీశైలంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివార్ల దర్శనానికి దేవస్థానం చేసిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌, ఎస్పీ ఫక్కీరప్ప శుక్రవారం పరిశీలించారు. క్యూలైన్ల ప్రవేశ ద్వారం వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకొని దర్శనానికి వచ్చారు.

భక్తులు భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కునేందుకు ఏర్పాట్లు, అవగాహన కోసం ఫ్లెక్సీబోర్డుల ఏర్పాటు వంటి అంశాలను ఈవో రామారావు వారికి వివరించారు. అంతకుముందు కలెక్టర్‌, ఎస్పీ నక్షత్రవనంలో మొక్కలు నాటారు.