1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Sankranti celebrations in Srisailam from 12th

12 నుంచి శ్రీశైలంలో సంక్రాంతి బ్రహోత్సవాలు

Sankranti celebrations
సుప్రసిద్ధ శైవ క్షేత్రమైన శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన శ్రీశైల దేవాలయంలో ఈ నెల 12 నుంచి 18 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.

ఈ మేరకు ఆలయ నిర్వాహకులు ఒక ప్రకటన చేశారు. ఈ బ్రహ్మోత్సవాలు సాగుతున్న సమయాల్లో  ఆర్జిత కల్యాణం, రుద్రహోమం, ఏకాంత సేవలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. భక్తుల రద్దీని తట్టుకునేందుకు ఆలయంలో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
About Writer
ఎం
తర్వాతి కథనం
సులేమానీ కుమార్తె: నా తండ్రిని చంపిన అమెరికాకు 'చీకటి రోజు' తప్పదు