శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 6 జనవరి 2020 (17:45 IST)

బుగ్గనపై పరువు నష్టం దావా : రావెల

తనపై నిరాధార ఆరోపణలు చేసిన ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిపై పరువు నష్టం దావా కేసు వేస్తున్నానని మాజీ మంత్రి, బీజేపీ నేత రావెల కిశోర్ బాబు తెలిపారు. ఆయనపై రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేస్తున్నట్లు మీడియా ముఖంగా రావెల స్పష్టం చేశారు.

విజయవాడలో మీడియా మీట్ నిర్వహించిన ఆయన వైసీపీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. ‘బుగ్గనపై పరువు నష్టం కేసుతో వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. రాజధాని అనేది రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేసేది. అలాంటి రాజధానిని తరలింపు విషయంలో ప్రజల పక్షాన పోరాడుతుంది .

నా నోటీస్ అందిన తర్వాత అయిన బుగ్గన రాజేంద్ర బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఎస్సీ, ఎస్టీ మనోభావాలు దెబ్బతినేలా బుగ్గన వ్యాఖ్యలు ఉన్నాయి’ అని రావెల చెప్పుకొచ్చారు. ‘రాజధాని అమరావతిని తరలించేందుకు పెద్ద కుట్ర జరుగుతోంది. కుట్రలో భాగంగా వైసీపీ అనుకూల మీడియాతో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. రాజధానిలో నాకు భూములు ఉన్నాయని ఆరోపణలు చేశారు.

నేను అద్దె ఇంట్లో ఉంటున్నాను. కుటుంబ పోషణ కష్టతరంగ ఉన్న నాపై ఇలాంటి ఆరోపణలు చేయడం ఖండిస్తున్నాను. ఒక దళిత నాయకుడిగా స్వయంకృషితో ఎదిగిన నాపై ఇలాంటి ఆరోపణలు చేయడం ఎంత వరకు సబబు..?

రాజధాని ఆంధ్రప్రదేశ్ యువత బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే ప్రాజెక్ట్. ఇవాళ వైసీపీ ప్రభుత్వం రాజధానిని నాశనం చేస్తోంది’ అని మాజీ మంత్రి రావెల ఆరోపించారు.