శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : సోమవారం, 6 జనవరి 2020 (17:51 IST)

కాజీపేట్‌ సమీపంలో పట్టాలు తప్పిన రైలు ఇంజన్‌

కాజీపేట్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఓ రైలు ఇంజన్‌ పట్టాలు తప్పింది. ట్రైన్‌ ఇంజన్‌ మార్చడానికి వెళ్తున్న క్రమంలో ప్రమాదావశాత్తు ఈ ఘటన జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

ఈ క్రమంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు కాజీపేట్‌ స్టేషన్‌లోనే నిలిపారు. గన్‌పూర్‌ స్టేషన్‌లో దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు.

దీంతో ప్రయాణీకులు అసౌకర్యానికి గురయ్యారు. కాగా, రైల్‌ ఇంజన్‌ను పట్టాలపై నుంచి పూర్తిగా పక్కకు జరిపిన సిబ్బంది, మరమ్మతులు చేపట్టారు. దీంతో, రైళ్ల రాకపోకలకు మార్గం సుగమమైంది.