సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: శనివారం, 4 జనవరి 2020 (16:47 IST)

అసదుద్దీన్‌ను క్రేన్‌కి తలకిందులుగా వేలాడదీసి గెడ్డం గొరిగిస్తా... ఆ తర్వాత: బిజెపి ఎంపి ధర్మపురి

బిజెపి నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ... అసదుద్దీన్ ఓవైసీ, మిమ్మల్ని తలక్రిందులుగా ఒక క్రేన్‌కు వేలాడదీసి మీ గెడ్డం గొరిగిస్తానని హెచ్చరిస్తున్నా. అంతేకాదు... గొరిగిన మీ గెడ్డాన్ని ముఖ్యమంత్రికి గెడ్డానికి అంటించి ప్రమోషన్ ఇస్తాను అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
 
 మరోవైపు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు వివాదాస్పద కామెంట్స్ చేసారు. హిందువులకు కోపం వస్తే మీ టోపి చింపేస్తాం అనీ, హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడితే పాకిస్తాన్‌లో హిందువులకు ఎదురయ్యే పరిస్థితి ఇక్కడ ముస్లింలకు ఎదురవుతుందంటూ విమర్శించారు. 
 
రాహుల్ గాంధీ, కేసిఆర్ లాంటి వాళ్లు ఎంతమంది వచ్చినా ఏమీ చేయలేరనీ, మోదీ, అమిత్ షా ఉన్నంతవరకు హిందువులకు ఏమీ కాదని అన్నారు. ముస్లిం యువకులు మన ఆడపిల్లల జోలికి వస్తే తామున్నామనే భరోసా యువత కల్పించాలన్నారు. రైల్వే పనులు ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమన్నారు.