శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 జనవరి 2020 (21:20 IST)

అమరావతి అంతా గ్రాఫిక్స్... అదే చంద్రబాబు చేసిన అభివృద్ధి : విజయసాయి రెడ్డి

అమరావతి అభివృద్ధిపై వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి మరోమారు తన ట్విట్టర్ ఖాతాలో కామెంట్స్ చేశారు. అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. ముఖ్యంగా, గ్రాఫిక్స్ పేరుతో ప్రజలను మోసం చేశారంటూ విజయసాయి రెడ్డి ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆయన గురువారం ఓ ట్వీట్ చేశారు. 2014-19 మధ్య 1513 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. టీడీపీ నేతలు, రియల్టర్స్ అమరావతిలో ఎస్సీ, ఎస్టీలు, రైతుల నుంచి అక్రమంగా భూములు స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. 
 
రాజధాని అమరావతికి గత ప్రభుత్వం చేసింది ఏదైనా ఉందంటే.. అది భూసేకరణ కుంభకోణం, ఇన్‌సైడర్ ట్రేడింగ్, గ్రాఫిక్స్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనిపై వ్యాఖ్యలు చేసే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.