శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 24 డిశెంబరు 2019 (19:52 IST)

సుజనా చౌదరికి షాక్, విజయసాయిరెడ్డా మజాకా.. ఏమైంది?

భారతీయ జనతా పార్టీ ఎంపి సుజనా చౌదరిపై వైసిపి ఎంపి విజయాసాయిరెడ్డి చేసిన ఆరోపణలను పరిశీలించాలని కేంద్ర హోంశాఖను కోరారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. దీంతో సుజనాకి ఊహించని షాక్ తగిలింది.
 
సుజనాచౌదరిపై వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి కార్యాలయం నోట్‌తో రీ డైరెక్ట్ కావడంతో ఆ లేఖను సంబంధిత శాఖలకు పంపిన హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి ఆర్థిక నేరాలపై, ఆయన అక్రమ కంపెనీలపై మనీ లాండరిగ్ వ్యవహారాలపై ఈడీ సిబీఐ చేత దర్యాప్తు చేయించాలని వైసిపి ఎంపి తన లేఖలో పేర్కొన్నారు.
 
దీనిపై రాష్ట్రపతి నుంచి విజయసాయిరెడ్డికి బదులిస్తూ లేఖ వచ్చింది. దీంతో సుజనా చౌదరిపై కేంద్ర దర్యాప్తు సంస్ధలు విచారణ జరపొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదే జరిగితే సుజనాచౌదరి అరెస్టు కావడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది.