సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: శనివారం, 4 జనవరి 2020 (20:53 IST)

నకిలీ ఆధార్ కార్డ్ సృష్టించిన బర్మా దేశీయుడు అరెస్ట్

నకిలీ ఆధార్ కార్డు సృష్టించి చలామణి అవుతున్న బర్మా దేశీయుడిని కంచన్ బాగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలిలా వున్నాయి. బర్మా దేశానికి చెందిన రహీం ఉల్లా(34) అనే యువకుడు 10 సంవత్సరాల క్రితం భారతదేశానికి రావడం జరిగింది. పాతబస్తి కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబానగర్ బి బ్లాక్‌లో కుటుంబంతో నివాసం ఉంటున్నాడు.
 
రహీం ఉల్లా చట్టవ్యతిరేకంగా నకిలీ ఆధార్ కార్డ్ సృష్టించిన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అతని ఇంటిని తనిఖీ చేయగా అతని పేరు మీద నకిలీ ఆధార్ కార్డ్ ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. అతని కుటుంబంపై కూడా నకిలీ ఆధార్, ఓటర్ కార్డులు ఉన్నాయో లేదో త్వరలో తెలుపుతామని పోలీసులు తెలిపారు.